దేశం గ‌ర్వించ‌ద‌గ్గ మహానేత వైయ‌స్ఆర్

- ఆరోగ్య‌శ్రీ, ఫీజురీయంబ‌ర్స్‌మెంట్‌, ప‌క్కాఇళ్లు రాజన్న ఘ‌న‌త‌
-అన్ని వర్గాలకు మేలు చేసిన గొప్ప నాయకుడు వైయస్ఆర్
- వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీకాకుళంః దివంగ‌త ముఖ్యమంత్రి, మ‌హానేత డాక్ట‌ర్ వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌విశ్వాసం, భ‌రోసా నిచ్చింద‌ని, భ‌విష్య‌త్ త‌రాల‌కు సైతం రాజ‌న్న పాల‌న ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. శ్రీకాకుళంలో త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... భార‌త‌దేశంలోనే ఏ ముఖ్య‌మంత్రి చేయ‌లేని సేవ‌లు, ప్ర‌వేశ‌పెట్ట‌ని సంక్షేమ ప‌థ‌కాల‌ను వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ పెట్టార‌న్నారు. 

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే....
- ఉమ్మ‌డి రాష్ట్రంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలో రాక‌ముందు (2004 కు ముందు) ఓ వైపు క‌రువు తాండ‌విస్తుంటే... మ‌రోవైపు రైతుల వ‌ల‌స‌లు, వ్య‌వ‌సాయానికి బ‌దులు రైతుల మెడ‌కు ఉరితాడులు స‌ర్వ‌సాధారణంగా మారిపోయాయి. 
- అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించాల్సింది పోయి వారి ప్రాణాల‌తో చెలగాటం ఆడేలా ప‌రిపాల‌న చేసింది
- ఈ నేప‌థ్యంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న పాద‌యాత్ర‌తో రైతుల్లో, ప్ర‌జ‌ల్లో భరోసా క‌ల్పించారు
- తాను అధికారంలోకి రాగానే రైతుల‌కు తొమ్మిది గంట‌ల ఉచిత విద్యుత్ ను అందిస్తాన‌న్న మాట‌కు క‌ట్టుబ‌డి మొద‌టి సంత‌కం ఉచిత విద్యుత్‌పైనే చేశారు. 
- ఆదేశక సూత్రాల‌ను తూచ త‌ప్ప‌కుండా పాటించి, పరిపాల‌న చేసిన ఘ‌త‌న రాజ‌న్న‌కే ద‌క్కింది
- రైతే రాజు అన్న ధీమా రైతుల్లో క‌లిగించి, ప్ర‌పంచ దేశాలు సైతం ఏపీ వైపు త‌లెత్తి చూసే విధంగా వైయస్ఆర్ పరిపాల‌న చేశారు 
- బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు అభివృద్ధి ప‌థంలో ముందుకు వెళ్లింది వైయ‌స్ఆర్ హ‌యంలోనే
- ఉమ్మ‌డి రాష్ట్రంలో అన్ని జిల్లాల‌తో పొల్చుకుంటే త‌ల‌స‌రి ఆదాయం త‌క్కువ‌గా ఉన్న జిల్లా, అత్యంత వెన‌క‌బ‌డిన జిల్లా శ్రీ‌కాకుళం
- రాష్ట్రాన్ని విభ‌జించే ముందు శ్రీ కృష్ణ క‌మిష‌న్ సైతం శ్రీ‌కాకుళం అత్యంత వెన‌క‌బ‌డిన జిల్లాగా పేర్కొంది. శివ‌రామ‌కృష్ణ కమిటీ కూడా శ్రీ‌కాకుళం జిల్లాలో రాజ‌ధానిని నిర్మించాల‌ని సూచించారు. 
- ఇటువంటి శ్రీ‌కాకుళం జిల్లాను బాబు ప‌ట్టించుకోకపోవడం బాధాకరం. 

మ‌హా ప‌థ‌కం ఆరోగ్య‌శ్రీ‌..
- అర‌కొర ఆదాయం ఉండే ఉమ్మ‌డి కుటుంబంలో ఎవ‌రైనా అనారోగ్యం పాలైతే కుటుంబ స‌భ్యులు ఆ వ్య‌క్తి చ‌నిపోయే వ‌ర‌కు రోదించ‌డ‌మే త‌ప్ప మ‌రేమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉంది చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో.
- ఒక పేద‌వాడు కార్పొరేట్ ఆస్ప‌త్రిని బ‌య‌టి నుంచి చూడ‌డ‌మే త‌ప్ప అందులో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమ‌త ఉండేది కాదు 2004కు ముందు.
- ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తి పేద‌వాడు కార్పొరేట్ వైద్యం చేయించుకోగ‌ల‌గాలి అన్న ల‌క్ష్యంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి
- ఒక పేద‌వాడి కుటుంబంలో ఎవ‌రైనా అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం అప్పుల పాలు కాకూడ‌ద‌న్న ల‌క్ష్యంతో పేద‌వాడి గుమ్మంలోకి వైయస్ఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థకాన్ని తీసుకొచ్చారు. భార‌త‌దేశంలో ఈ పథకాన్ని మొట్ట‌మొద‌టిసారిగా అమ‌లు చేసిన ఘ‌న‌త ఒక్క వైయ‌స్సార్‌కే ద‌క్కింది
- పార్టీల‌క‌తీతంగా ఎంతో పేరు తెచ్చిన ఘ‌న‌త ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి ఉంది

ఇందిర‌మ్మ ఇళ్లు...
- మ‌హానేత రాజ‌న్న రాష్ట్రంలో గుడిసెలు ఉండ‌కూడ‌దు... అంద‌రికీ ప‌క్కా ఇళ్లు అన్న నినాదంతో ముందుకు వెళ్లారు
- ఈ క్ర‌మంలో ఇందిర‌మ్మ ఇళ్లు ప‌థ‌కం పేరుతో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు 
- 65 సంవ‌త్స‌రాల పాటు ఎంతో మంది నాయ‌కులు స‌ముద్ర తీరంలో ఉన్న వారికి ధృఢ‌మైన ప‌క్కా ఇళ్లు నిర్మించ‌లేక‌పోయారు
- కానీ మ‌న రాజ‌న్న ఇందిర‌మ్మ ఇళ్లు పేరుతో నిర్మించిన ప‌క్కా ఇళ్లు...  విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో ఉన్న ఒక్క ఇళ్లు కూడా హుద్ హుద్ వచ్చినా కూలిపోలేదంటే ఆ ఘ‌న‌త ఇందిర‌మ్మ ఇళ్ల‌ను నిర్మించిన వైయ‌స్సార్‌ది.
- తాను ఏ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడినా ఏ ఒక్క‌రు త‌మ‌కు ప‌క్కా ఇళ్లు అంద‌లేద‌న్న మాట విన‌ప‌డ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో వైయ‌స్సార్ ప్ర‌భుత్వం ప‌ని చేసింది.
- ఒక్క శ్రీ‌కాకుళం జిల్లాలోనే ఇచ్చాపురం నుంచి ర‌ణ‌స్థ‌లం వ‌ర‌కు సుమారు 170 ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించారు వైయ‌స్సార్‌
- ఇంటి మంజూరులో కేవ‌లం అత‌డి పేద‌రికం, అర్హ‌త మాత్ర‌మే చూసేవారు త‌ప్ప‌... ఏ పార్టీకి చెందిన వ్య‌క్తి అని వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఏనాడు చూడ‌లేదు
- అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాక‌పోతే సంబంధిత అధికారిని ప్ర‌శ్నించి మ‌రీ మంజూరు చేయించిన ఘ‌న‌త రాజ‌న్న హ‌యంలో కొనసాగింది. 

వృద్ధాప్య భ‌ద్ర‌త‌
- 60 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్కరికి రూ. 200 ఫించ‌న్ అందించిన మ‌హా నాయ‌కుడు వైయ‌స్సార్‌
- త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకొని వారు రోడ్డు పాలు కాకుడ‌ద‌న్న ల‌క్ష్యంతో త‌ల్లిదండ్రుల‌కు కొండంతా అండ‌గా నిలిచి 60 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి పింఛ‌న్ అందించారు
- 60 ఏళ్లు నిండిన వారికి ఫించ‌న్ వారి హ‌క్కు అన్న నినాదం తీసుకొచ్చారు.
- ప్ర‌స్తుతం అర్హుల‌కు ఫించ‌న్ రావాలంటే ముందుగా మా పార్టీకి ఓటు వేశారా..?  మా పార్టీకి చెందిన వారేన‌ా అని చూస్తున్నారు త‌ప్ప‌... అర్హ‌త ఉందా?  లేదా అని మాత్రం గ‌మ‌నించ‌డం లేదు

ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌
- త‌న బిడ్డ తెలివైన వాడైన ఆర్థిక పరిస్థితి బాగలేనందున ఉన్న‌త విద్య‌ను చ‌దివించ‌లేక‌పోతున్నాన‌ని తల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తీసుకొచ్చిన గొప్ప ప‌థ‌కం ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌. 
- త‌న రాష్ట్రంలో ఏ పేద త‌ల్లిదండ్రులు కూడా పేద‌రికం వ‌ల్ల ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌లేద‌న్న నిరుత్స‌ాహం ఉండ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌ను ప్ర‌వేశ పెట్టారు 
- సోసైటీలో ఉన్న అన్నివ‌ర్గాల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌న్న ధ్యేయం వైయ‌స్ రాజ‌న్న‌లో నిరంత‌రం ఉండేది
- రాజ్యాంగంలో ఉన్న మౌళిక ఆదేశాల సూత్రాల‌కు అనుగుణంగా పరిపాల‌నా చేసే ఆలోచ‌న‌తో నిరంత‌రం పాటుప‌డే మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి
- వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పరిపాల‌న ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌విశ్వాసం, భ‌రోసానిచ్చింది
- భ‌విష్య‌త్ త‌రాల‌కు సైతం వైయ‌స్సార్ ప‌రిపాల‌న ఆద‌ర్శంగా నిలుస్తుంది
Back to Top