చేతగాని ముఖ్యమంత్రి

తిరుపతి (మంగళం): ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నే త వైయస్  జగన్‌మోహన్‌రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించు గంగమ్మ తల్లి అంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వేడుకున్నా రు. తాతయ్యగుంట గంగమ్మను  దర్శించుకుని, ప్రత్యే క పూజలు చేయించారు. 

ఈసందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా జననేత చేపట్టిన జలదీక్షకు  లక్షలాది మంది రైతులు, ప్రజలు మద్దతు తెలపడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని తెలిసినా  కూడా బాబు నోరుమెదపడం లేదని మండిపడ్డారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎదురించే ధైర్యం లేక  చేతగాని సీఎంగా నిలుస్తున్నారని విమర్శించారు.

To read this article in English: http://bit.ly/254NXSE   

Back to Top