చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి

పశ్చిమగోదావరి(కొయ్యలగూడెం): ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  చేపడుతున్న జలదీక్షకు మద్దతుగా నియోజవకర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షాశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు.
సీమాంధ్రని ఎడారిగా మార్చే విధంగా ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టుల్ని చేపడుతున్నా...అడ్డుకోలేని అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని  విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించుకోలేకపోయారని, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై కూడా చేతకాని విధంగా ఉండిపోయారన్నారు.  రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న వైయస్ జగన్‌ జలదీక్షకి అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని బాలరాజు చెప్పారు.
Back to Top