తాగునీటి స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి

కావ‌లిః నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల తాగునీటి స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బాగోలు మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి ఎమ్మెల్యే హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు అధికారులు శాశ్వ‌త ప‌రిష్కారం చేయాల‌న్నారు. అదే విధంగా విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై కూడా అధికారుల‌తో చ‌ర్చించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల‌పై ఎమ్మెల్యే ఆరా తీశారు. కార్య‌క్ర‌మంలో మండ‌ల ప‌రిష‌త్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. 

Back to Top