ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాంపత్తికొండ: వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు ముస్లిం సోదరులు మద్దతు పలికారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ రహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగాఆయన ఉర్దూలో ప్రసంగించారు.  ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వస్తే ఇమామలకు నెల నెలా రూ. 10 వేల ఇస్తామని, అదే విధంగా చర్చి, మసీద్, దేవాలయాలకు నెలకు రూ. 15 వేలు ఇస్తామన్నారు. సమాజంలో ప్రతి పని విజయవంతం కావడానికి దేవుడి కరుణ,కటాక్షాలు అవసరమన్నారు. దేవుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా పరిపాలన చేస్తామన్నారు.Back to Top