వైయ‌స్ జ‌గ‌న్‌పై అక్ర‌మ కేసులు అన్యాయం

న‌ల్గొండ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ ప్ర‌భుత్వం పెట్టిన అక్ర‌మ కేసుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి త‌ప్పుప‌ట్టారు. బుధ‌వారం ఆయ‌న న‌ల్గొండ‌లో మీడియాతో మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్‌పై ఏపీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరును ఆక్షేపించారు. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి బ‌స్సు ప్ర‌మాదానికి గురైతే సంబంధిత యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేయ‌కుండా, త‌ప్పుల‌ను ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం దారుణ‌మ‌న్నారు. చంద్ర‌బాబు త‌న తీరు మార్చుకోవాల‌ని గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి సూచించారు.

Back to Top