వైయస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టు

రాజమండ్రి: వైయస్సార్సీపీ రాష్ట్ర
నేతల్ని పోలీసులు అటకాయించారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం
చేరుకొన్న నాయకుల్ని అక్కడే అదుపులోకి తీసుకొన్నారు.


ప్రభుత్వ
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వైఎస్ఆర్
సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స
సత్యనారాయణ, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను తదితరులు  చేరుకున్నారు.
అయితే వారిని రాజమండ్రి విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకోవడంతో, ఆ చర్యను నిరసిస్తూ నిరసనకు దిగారు. దీంతో వారిని అదుపులోకి
తీసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‑కు తరలించారు. అగ్ర నేతలకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం చేరుకొన్న జిల్లా వైయస్సార్సీపీ
నాయకుల్ని పోలీసులు లోపలికి అనుమతించలేదు. 


Back to Top