బీసీలకు తోడుగా ఉంటా

–కులాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.
– తీర్మానాలతో బోయలను మోసం చేశారు
– పెరిక బలిజ కులస్తులకు బీసీ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు
– బీసీల ఆత్మీయ సమ్మేళనంలో 
– ప్రతి ఒక్క కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజినీరింగ్‌ చదివిస్తా.
– ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లకే పింఛన్లు 
– పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా 



చిత్తూరు: బీసీలకు తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించాలని ఆయన సూచించారు. పాపానాయుడుపేటలో బీసీలమంతా ఒక్కటై ఆత్మీయ సమ్మేళనంతో కలిశాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇలాంటి సమయంలో మనకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించాలి. ఈ నాలుగేళ్ల పాలనలో మనకు మంచి జరిగిందా?, చెడు జరిగిందా? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరిని కోరుతున్నాను. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం బీసీల ప్రేమ అంటాడు. నాలుగు ఇస్త్రీ పెట్టేలు, నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీలపై ప్రేమ అంటారు. ఇవాళ ఇంజినీరింగ్‌ చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా? పేదలకు ఎవరైనా మంచి చేశారు..తోడుగా ఉన్నారంటే అది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గొప్పగా చెబుతున్నాను. పేదరికం నుంచి బయటకు రావాలంటే కుటుంబం నుంచి ఒక్కడైనా ఇంజినీర్, డాక్టర్‌ కావాలి. మన పిల్లల్ని గొప్పగా చదివించేందుకు ఆరాటపడింది ఒక్క వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. నాన్నగారి పాలనలో గొప్ప చదువులు చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ప్రోత్సహించారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ ఇంజీనీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రూ.30 వేలు మాత్రమే ముష్టి వేసినట్లు వేస్తున్నారు. అది కూడా ఏడాదిగా రావడం లేదని పిల్లలు చెబుతున్నారు. మిగతా డబ్బు ఆ పేదవాళ్లు ఎలా చెల్లిస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు. మీ గుండెలపై చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. నాన్నగారి హయాంలో గొప్ప అభయ హస్తం ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా?
– ఈ పరిస్థితిని మార్చేందుకు నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే ..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. చంద్రబాబు పాలనను ఒక్కసారి చూడండి. బీసీలను మోసం చేసేందుకు టీడీపీ మేనిఫేస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. రకరకాలుగా ఫోజులు ఇస్తారు. గౌడ సోదరులు కనిపిస్తే వారి భుజాన ఉన్న ట్యూబ్‌ తన భుజంపై వేసుకొని ఫోజులు కొడతారు. చేనేత కార్మికుల ఇంట్లో దూరి పక్కనే కూర్చోని ఫొటోలు దిగుతాడు. ఆ ఫొటోలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు ఇలా ఉన్నాయి..రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారట. కురువ, కురుభలను ఎస్టీలుగా గుర్తిస్తారట. బోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారట. ఇలా ప్రతి కులానికి కూడా హామీ ఇచ్చి మోసం చేశారు. ఇటీవల మత్య్సకారులు చంద్రబాబును నిలదీస్తే..ముఖ్యమంత్రినే అడుగుతావా? తాట తీస్తా..ఖబడ్దార్‌ అంటూ హెచ్చరిస్తున్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రతి కులాన్ని మోసం చేశాడు.  ఇదే చంద్రబాబు బీసీ సబ్‌ ప్లాన్‌ అన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్లలో రూ. 250, 2573 కోట్లు, 500 కోట్లు ఇచ్చారు. ఎక్కడ రూ.40 వేల కోట్లు? ఎవరైనా నిలదీస్తే ఖబడ్ధార్‌ అంటూ బెదిరిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో బోయలను ఎస్టీలుగా చేర్చుతూ తీర్మాణం చేసి ఢిల్లీకి పంపించారట. నా పని అయిపోయిందని చేతులు కడుకున్నారు.  ఎన్నికల్లో ఆరోజేమో చేసేస్తా అంటారు. ఈ రోజు మాత్రం నా చేతుల్లో లేదని తప్పించుకుంటున్నారు. ఏమీ జరగకముందే తన కార్యాలయం నుంచి ఫోన్లు చేసి కేక్‌ కట్‌ చేస్తారు. అలాగే అదే కార్యాలయం నుంచి మరో వర్గానికి ఫోన్లు చేసి ధర్నాలు చేయమంటారు. ఆలు లేదు..సోలు లేదు అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఇదే జిల్లాలోనే, ఇక్కడే పెరిక బలిజ కులస్తులు 40 సంవత్సరాలుగా బీసీలుగా ఉన్నవారు సర్టిఫికెట్‌ అడిగితే ఇవ్వడం లేదు. అగ్ని కుల క్షత్రియులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా దిక్కులేదు. నాలుగేళ్ల పాలన చూశాం కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి.

అప్పుడే మన తలరాతలు మారుతాయి..

– దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయబోతున్నామో క్షుప్తంగా చెబుతున్నాను. మీరు సలహాలు ఇవ్వండి, వాటిని స్వీకరిస్తాను. నాన్నగారి స్వప్నం పేదకుటుంబం నుంచి ఒక్కడైనా డాక్టర్, ఇంజినీర్‌ కావాలన్నది. దాని కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెబుతున్నాను. మీ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా ఎన్ని లక్షలు ఖర్చైనా నేనే చదివిస్తాను. పెద్ద చదువులు చదివించడమే కాదు..హాస్టల్‌ ఖర్చుల కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం.  డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యేందుకు పునాదులు చిట్టి పిల్లల నుంచే పునాదులు పడాలి. ఆ చిట్టి పిల్లలను బడికి పంపిస్తే సంవత్సరానికి రూ.15 వేలు ఆ తల్లి ఖాతాలో జమా చేసి తోడుగా ఉంటాను. 
– అవ్వతాతల పింఛన్లు పెంచేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. కాంట్రాక్టర్లకు పెంచేందుకు మాత్రం చంద్రబాబు  విచ్చలవిడిగా అంచనాలు పెంచి ఇస్తున్నారు. కారణం ఏంటో తెలుసా..ఆయనకు కాంట్రాక్టర్లు బాగా లంచాలు ఇస్తారని, అవ్వతాతల నుంచి ఆయనకు లంచాలు రావు కాబట్టి పింఛన్లు పెంచడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.2 వేలకు పెంచుతాను. బీసీలు, ఎస్టీలు, ఎస్సీల పరిస్థితి దయానీయ పరిస్థితి చూశాను కాబట్టి..వారి కోసం పింఛన్‌ రూ.2 వేలు ఇవ్వడమే కాదు.. పింఛన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తానని మాట ఇస్తున్నాను. ఈ రూ.2 వేలతోనైనా ఆ కుటుంబం ఎవరిపై ఆధారపడకుండా చల్లగా బతుకుతారు.
– ఆరోగ్యశ్రీని మార్పు చేయబోతున్నాం. ప్రతి పేదవారికి పక్కా ఇల్లు కట్టించి తోడుగా నిలుస్తాను. నాన్నగారు దేశంతో పోటీ పడి 48 లక్షల ఇల్లు కట్టించారు. ఈ పని చంద్రబాబు చేయడం లేదు. 
–– పేదలకు మంచి చేసేందుకు బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశాం. వారు ప్రతి జిల్లాలో అన్ని కులాలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ గర్జన నిర్వహిస్తాం. ఆ సభలో బీసీ డిక్లరేషన్‌ చేస్తాం. అందులో బీసీలకు ఏం చేస్తామన్నది పొందుపరుస్తాం. మన ప్రభుత్వం వచ్చాక వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తాం. అందరూ తనకు తోడుగా నిలవాలని కోరుతున్నాను.

తాజా వీడియోలు

Back to Top