నాలుగు హామీలు నెరవేర్చానని చెప్పిస్తే రాజీనామా చేస్తా

జేసీ సోదరులు చంద్రబాబు బంట్రోతులు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు: ప్రజలను ప్రభావితం చేసిన
నాలుగు హామీలు నెరవేర్చారని ఏదైనా మారుమూల గ్రామస్తులతో చంద్రబాబు చెప్పించగలిగితే
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాలు విసిరారు. నెల్లూరు వీఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో
జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష వేదికపై కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో
నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరూ ప్రజల ముందుకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రానికి
ప్రత్యేక హోదా ఇస్తామన్నారా లేదా చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం
చేసిన నాలుగు అంశాలు రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదవాడికి పక్కా
ఇళ్లు ఎక్కడైనా నెరవేర్చారా చంద్రబాబూ అని నిలదీశారు. చంద్రబాబుకు నచ్చిన గ్రామం
నారావారి పల్లెకు వస్తా.. నాలుగు హామీలు అమలు చేశారని చెబితే చంద్రబాబు గొప్పోడని
ఒప్పుకుంటానన్నారు. ప్రధాన మంత్రి,
చంద్రబాబు ఇద్దరు కలిసి
ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేసిన తీరు.. ఒకరిమీద ఒకరు మాటలు చెప్పుకుంటూ మళ్లీ మోసం
చేస్తున్నారన్నారు. నయవంచకులకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా ఇవాల్టీకి బతికి ఉందంటే దానికి కారణం వైయస్‌ జగన్‌ అని గుర్తు
చేశారు. 

జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు
చంద్రబాబుకు బంట్రోతులుగా తయారయ్యారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
ఇద్దరు లఫంగి సోదరులు చంద్రబాబుకు బ్రోకర్లకంటే ఎక్కువగా తయారయ్యారన్నారు. వైయస్‌
జగన్‌ గురించి జేసీ సోదరులు మాట్లాడుతుంటే.. రక్తం మరుగుతుందన్నారు. సభ్యతగా
మాట్లాడడమే వైయస్‌ జగన్‌కు ఇష్టం కాబట్టి సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు.
వైయస్‌ జగన్‌ ఒక్కమాట చెబితే మీ అంతు తేల్చేందుకు మా కార్యకర్తలు చాలని, కానీ మా పార్టీకి, నాయకుడికి కొన్ని
సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైయస్‌ జగన్‌
తపిస్తున్నారన్నారు. 

Back to Top