ఆశా వర్కర్లకు అండగా ఉంటా..జననేత హామీ

నూజివీడు:

అధికారంలోకి వచ్చిన తరువాత ఆశా వర్కర్ల జీవితాలు మెరుగపడేలా చర్యలు తీసుకుంటాని ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను పలువురు ఆశా వర్కర్లు కలిసి తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో  తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం మానేశారని, తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆర్ధిక మంత్రి ఆశావర్కర్లకు పనిని బట్టి వేతనం ఇస్తామంటూ చేసిన ప్రకటన తమను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఒక్కో ఆశా వర్కర్ కు ఆరువేలు ఇస్తుంటే, తాము వెయ్యి 12 వందలు కూడా సంపాందించలేని స్థితిల్లో, రాత్రనక పగలనక సేవలందిస్తున్నామని వాపోయారు. తమ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే, పోలీసుల లాఠీలతో కొట్టిస్తూ, బూటు కాళ్లతో తన్నిస్తున్నారని, ఉన్న ఉద్యోగం కూడా పోతుందని హెచ్చరిస్తున్నారని వారు జననేతకు సమస్యలు చెప్పారు. కనీస వేతనాలు లేకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేస్తున్నారా? చెప్పాలని వారు అడిగారు. ఉద్యోక భద్రత కల్పించకపోయినా, ఒక పూట తిండి తినడాకైనా సరిపోయే వేతనం ఇవ్వమని తాము కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యలను విన్న వైయస్ జగన్ వీరికి మెరుగైన వేతనాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top