ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక ఇబ్బంది

తూర్పుగోదావరి: తెలంగాణలో చదివే ఆంధ్ర విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజురియంబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయడం లేదని బాసర త్రిబుల్‌ ఐటీ విద్యార్థి వైయస్‌ జగన్‌ను కలిసింది. ఫీజురియంబర్స్‌మెంట్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజురియంబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. టీడీపీ వచ్చిన తరువాత పథకం నీరుగారిపోయిందన్నారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ ఒక్క సంవత్సరం మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పింది. ప్రభుత్వానికి ఒక లేఖరాయాలని వైయస్‌ జగన్‌ను ఆ విద్యార్థి కోరింది. వైయస్‌ జగన్‌ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని, అన్న వస్తే ఉచితంగా చదువుకుంటామని చెప్పింది. 
Back to Top