బీసీల జోలికొస్తే పుట్టగతులుండవ్‌

అనంతపురం: బీసీల జోలికొస్తే టీడీపీకి పుట్టగతులుండవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కనగానపల్లి మండల ఉపాధ్యక్షుడు పెద్దయ్య హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఆయన శనివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనగానపల్లెలో వైయస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి పరిటాల కుతంత్రాలు పన్ని టీడీపీ అభ్యర్థిని మండల పరిషత్‌ అధ్యక్షుడిగా గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో మంత్రి బీసీలను మోసం చేశారని, ఇది అనైతికమని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీసీల జోలికి వస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.

Back to Top