బాబు నీవు మగాడివైతే ప్రజల్లోకి రా

బాబుకు సిగ్గు,లజ్జ ఉంటే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్న బాబును ప్రజలు క్షమించరు
వైఎస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
జననేతను సీఎం చేసేందుకు సైనికుల్లా పనిచేద్దాంః పిన్నెల్లి

గుంటూరు(మాచర్ల):  రాష్ట్రంలో కరవును పట్టించుకోకుండా చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి గ్రామంలో నీళ్లతో అల్లాడుతున్నాం . రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  రైతన్నలు, పేదలకు భరోసా ఇచ్చేందుకే  వైఎస్ జగన్ పల్నాడు గడ్డకు రావడం జరిగిందని పిన్నెళ్లి పేర్కొన్నారు. 

కరవు ధర్నాలో భాగంగా మాచర్లలోని సమస్యలను వైఎస్ జగన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెడలు వంచుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకెళ్ళి వాటర్ స్కీములను సాధించుకుందామన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మినహా ఏ ముఖ్యమంత్రి పల్నాడును పట్టించుకున్న పాపాన పోలేదని రామకృష్ణారెడ్డి అన్నారు. రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్ పల్నాడు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.

ప్రజాసమస్యలను గాలికొదిలి బాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నారని పిన్నెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న ఎంతో కష్టపడి ఊరువాడ తిరిగి మీ అండతో(అక్కడి ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ) ఎమ్మెల్యేలను గెలిపిస్తే..బాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారడం దుర్మార్గమన్నారు. ఫిరాయింపుదారులను ప్రజలు, కార్యకర్తలు క్షమించరని చెప్పారు. బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే రాయలసీమలో పుట్టి ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నీవు మగాడివైతే, నీకు  ఏమాత్రం  సిగ్గు, లజ్జ, రోషం ఉన్నా ...ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి రా తేల్చుకుందామని పిన్నెల్లి సవాల్ విసిరారు. రైతులకు అండగా ఉండాలన్నా, రాష్ట్రానికి న్యాయం జరగాలన్నా....  రాజన్న కుటుంబం వైఎస్ జగన్ నాయకత్వంతోనే సాధ్యమని రామకృష్ణారెడ్డి  తేల్చిచెప్పారు.  వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని  చేసేందుకు పల్నాడు నుంచి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

Back to Top