అపహాస్యమైన ఐడీఎస్ స్కీమ్

హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ స్కీమ్ అపహాస్యమైపోయిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గుజరాత్, హైదరాబాద్ లో ఎవరో ఆస్తులు ప్రకటిస్తే దాన్ని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడడం దారుణమన్నారు. ఏ అంశం వచ్చినా  దాన్ని వైయస్సార్సీపీకి అంటగడుతూ బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ  బాబు, ఆయన మంత్రులు దగా కార్యక్రమాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు విషయం బాబుకు ముందే తెలుసునని, రూ. 2 వేల నోటు రాదని బాబు ముందే చెప్పాడని అన్నారు.

Back to Top