ఇది పన్నుపోటు ప్రభుత్వం

నెల్లూరు:

రకరకాల పన్నులతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ చరిత్రలో కాంగ్రెస్ పన్నుపోటు పాలన సాగించిన పార్టీగా నిలుస్తుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు.  కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా రూరల్ నియోజకవర్గంలో వివిధ రూపాల్లో నిరసనకు శ్రీకారం చుట్టామన్నారు. భోగి సందర్భంగా పాతవస్తువులను భోగి మంటల్లో వేయడం మన సంప్రదాయమన్నారు. రాష్ట్రానికి, దేశానికి చీడలా పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాల దిష్టిబొమ్మలను పండగ ప్రారంభానికి కొన్ని గంటల ముందే దహనం చేస్తామన్నారు. శనివారం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తామన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో ఒక్కరూపాయి కూడా కరెంట్ చార్జీ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. మహానేత స్ఫూర్తితో ఇప్పుడు కరెంటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.

Back to Top