ఇది మా అజెండా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం లోటస్ పాండ్ లో సమావేశమైంది.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన  పార్టీ  నేతలు
సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బాబు
అవినీతి పాలనను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
జగన్...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనమండలిలో
వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ గా పిల్లి
సుభాష్ చంద్రబోస్ వ్యవహరిస్తారు. 


అసెంబ్లీ స‌మావేశాల్లో వైఎస్సార్‌సీపీ అజెండా..!
 • ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం
 • రాజధాని పేరుతో భూసేకరణ
 • రుణభారంతో రైతుల ఆత్మహత్యలు
 • పుష్కరాల్లో మృత్యుఘోషపై  ప్రభుత్వంపై పోరు
 • ఓటుకు నోటు కేసులో బాబు అవినీతి 
 • నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు
 • ప్రభుత్వఅధికారులపై పచ్చఎమ్మెల్యేల దాడి
 • నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య
 • పట్టిసీమ,ప్రభుత్వ పథకాల్లో అవినీతి
 • కరువు..నిత్యవసర వస్తువుల ధరలు
 • అసెంబ్లీ లాంజ్ లో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగింపు
Back to Top