ఇది ప్రజల అజెండా...!

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రస్తావించబోయే 19 ప్రధానాంశాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ రోజు రాసిన బహిరంగ లేఖ లో వెల్లడించారు.  

 ఈ అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున లేవనెత్తే అంశాలు:

 1. స్వయంగా చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు వ్యవహారం
 2. పుష్కరాల్లో తన డాక్యుమెంటరీ: సినిమా షూటింగ్ల కోసం ఏకంగా 30 నిండు ప్రాణాలను బలిపెట్టిన వైనం

 3. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక దోపిడీ-సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్ ( మీరు తెలుగుదేశం తరఫున  జనరల్ పర్పస్ కమిటీకి ఎంపిక చేసిన 21 మందిలో ఆయన కూడా ఒకరు) తన నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అడ్డువచ్చిన తహశీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకొని ఈడ్చిన వైనం, సాక్షాత్తు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉండే నియోజకవర్గం తునిలో మా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జరిపిన దాడి..అనంతపురం జిల్లాలో అధికార పార్టీ విప్ చేస్తున్న ఇసుక దోపిడీ-దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టించిన వ్యవహారం

 4. నాగార్జున విశ్వ విద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాలలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, దోషులను ప్రభుత్వం వెనకేసుకు వస్తున్న తీరు

 5. చంద్రబాబునాయుడు గారి పాలనలో కరువు కాటకాల కారణంగా యావత్తు రైతాంగం విలవిలలాడుతుంటే సీఎం గారు బంధుగణంతో టర్కీ, స్విట్జర్లాండ్లలో చేస్తున్న, చేయబోతున్న విలాస పర్యటనలు

 6. ప్రత్యేక హోదా ఊసెత్తకుండా కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ మంత్రులు కొనసాగుతున్న తీరు

 7. చట్ట విరుద్ధమైన జీవో నెంబర్ 25 ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపు

 8. పేదలకు, బలహీన వర్గాలకు చదువును దూరం చేస్తూ బడులు, హాస్టళ్ల మూసివేత

 9. పట్టిసీమ, పోలవరం పేరిట వేల కోట్లు కొల్లగొడుతున్న విధం
 10. జీవో నెంబర్ 22 ద్వారా చేస్తున్న ధన యజ్ఞం

 11.బెరైటీస్లో టెండర్ల మార్పు ద్వారా భారీ గోల్మాల్

 12.  కమీషన్ల కోసం పారిశ్రామిక వేత్తలకు ప్రకటించిన రూ.2067 కోట్ల నజరానా

 13. ఎంపిక చేసిన డిస్టిలరీలకు మద్యం ఉత్పత్తి పెంచుకోవచ్చునంటూ ఇచ్చిన జీవో 369

 14. ప్రైవేటు కరెంటు సంస్థలకు రూ. 2300 కోట్ల సమర్పణ
 15. వేల కోట్ల బొగ్గు కుంభకోణం

 16. రాజధాని పేరిట సాగుతున్న విదేశీ లావాదేవీలు: స్విస్ ఛాలెంజ్ ద్వారా సింగపూర్లో బినామీ కంపెనీలకు సంతర్పణలు,భూ సేకరణ పేరిట ప్రభుత్వం బెదిరింపులు

 17. రుణమాఫీ జరగక రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనాలు

 18. ఇంటికో ఉద్యోగం-అది వచ్చే వరకు ప్రతి ఇంటికీ రూ. 2000 నిరుద్యోగ భృతి అని పదేపదే ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటనలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ కూడా ఇవ్వని ప్రభుత్వ దుర్మార్గం

 19. అంగన్వాడీలు, కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు
Back to Top