‘ఇదం జగత్’ టీజర్ రిలీజ్

 

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా విడుద‌ల‌
విశాఖ‌:   కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్ చిత్రం టీజ‌ర్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం విశాఖ జిల్లాలోని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చిత్ర యూనిట్ స‌భ్యులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి టీజ‌ర్‌ను విడుద‌ల చేయించారు.  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ తెరకెక్కిన ఈ సినిమాను పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అంజు కురియన్ నాయికగా పరిచయమవుతున్నారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌, హీరో సుమంత్ పేర్కొన్నారు.
Back to Top