ఐసీయూలో వైఎస్ జగన్..!

సర్వత్రా ఆందోళన..!
జగన్ ను చూడాలంటున్నకార్యకర్తలు,అభిమానులు..!
లోపలికి అనుమతించని పోలీసులు..!


గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. జీజీహెచ్ ఐసీయూలో వైఎస్ జగన్ చికిత్స పొందుతున్నారు. ఏడురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో, కనీసం 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. ఈమేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజునాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. క్రమేణా ఫ్లూయిడ్స్ అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

వైఎస్ జగన్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం 5 గంటలకు, మరోసారి 11 గంటలకు వైఎస్ జగన్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.  బీపీ 130/ 80 , పల్స్ రేటు 55, బ్లడ్ షుగర్ 121 , కీటోన్స్ 3+, యూరిక్ యాసిడ్ 13.3, బరువు 72.8 ఉన్నట్లు  ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల వెన్నంటే ఉన్నారు. మరోవైపు, వైఎస్ జగన్ ను చూసేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటురు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఉదయం 4.11 గంటలకు పోలీసులు వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసి బలవంతంగా జీజీహెచ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఐతే,  వైఎస్ జగన్ వైద్యాన్ని నిరాకరించినా డాక్టర్లు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 
Back to Top