'ఇచ్చిన మాటకు కట్టుబడే యువనేత జగన్'

కృష్ణా జిల్లా:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తరహలో రాష్ట్ర ప్రజలకు సువర్ణమైన పాలన అందించే సత్తా ఆయన తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువనేత శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికి మాత్రమే ఉందని పెడన మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, తెలుగు దేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ. సుబ్బారెడ్డి సమక్షంలో రాంప్రసాద్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైవీ సుబ్బారెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం ఉప్పాల రాంప్రసాద్‌కు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.

     శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిలో ఉన్న పట్టుదల, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, ఇడుపులపాయ ప్లీనరీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరానని ఉప్పాల చెప్పారు. నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయనపై తనకు ఆపారమైన అభిమానం పెరిగిందని చెప్పారు. అయితే ఆయన ప్రవేశపెట్టిన ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

భారీగా చేరికలు
విజయనగరం జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు పక్కాగా అమలు అవుతాయని ఆ పార్టీ నాయకుడు వల్లూరి జయప్రకాష్‌బాబు అన్నారు. స్థానిక వసంత విహార్‌లో చీపురు వలస గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వల్లూరి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రానున్న ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు పన్నినా ఆయన గెలుపును ఆపలేరన్నారు. పార్టీలో చేరిన వారందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వల్లూరి పిలుపునిచ్చారు. వైఎస్సార్ హాయంలో రైతులు సుభిక్షంగా ఉండేవారని, అలాంటి రోజులు రావాలంటే శ్రీ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని పిలపునిచ్చారు.

Back to Top