ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తా:- వైఎస్‌ జగన్

హైదరాబాద్: తెలంగాణలోని 5,6 జోన్లలో ఎంపికైన ఆంధ్రా ఇంజినీర్ల సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈసమస్యను గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ  ప్రజా ప్రతినిధులు ఇంజినీర్ల ప్రతినిధి బృందాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళతారని చెప్పారు. ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు నాగభూషణం నేతృత్వంలోని  ఆంధ్రా ఇంజినీర్ల బృందం జగన్‌ను కలసి..తమ సమస్య పరిష్కారానికి విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని 5,6 జోన్ల ( తెలంగాణ ప్రాంతంలోవి) లో ఎంపికైన 301 మంది ఆంధ్రా ఇంజినీర్లు విభజన సమయానికి ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ జోన్లలో ఎంపికైన  ఇంజినీర్లను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, వారికి పోస్టింగ్స్  ఇవ్వడానికి టీ ప్రభుత్వం నిరాకరించింది. ఫలితంగా నాలుగు నెలలుగా వారంతా పోస్టింగ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు.

Back to Top