అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే న్యాయం

  • అగ్రిగోల్డు బాధితులకు హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌
  • చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
  • చంద్రబాబు చర్మం మందం..అయిన గట్టిగా పోరాటం చేస్తాం
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. విజయవాడలో అగ్రిగోల్డు బాధితులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని వైయస్‌ జగన్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అగ్రిగోల్డు బాధితులకు సంబంధించి కేవలం రూ.1180 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ఆగ్రిగోల్డు  ఆస్తులు రూ.7500 కోట్లు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతుందన్నారు. ఈ ఆస్తులు అమ్మితే 13 లక్షల 30 వేల మందికి న్యాయం జరుగుతుందని తాము చెబుతున్నా..ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. ప్రజలకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రతిపక్షం చెప్పే మాటలు నోట్‌ చేసుకొని ఆ తరువాత బాధితులకు న్యాయం జరిగేలా స్టేట్‌మెంట్‌ ఇస్తే అది పద్ధతి అన్నారు. అలా చేస్తే సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉంటుందన్నారు. అలా కాకుండా సీఎం ముందుగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చి దానిపై 20 నిమిషాలు సమయం ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఈ సమయంలోనైనా బాధితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శతవిధాల ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు చనిపోయినా చంద్రన్న భీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నప్పుడు ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్న అగ్రిగోల్డు బాధితులకు ఆ ఐదు లక్షలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి మానవత్వం లేదని ధ్వజమెత్తారు.

ప్రత్తిపాటితో నాకు శత్రుత్వం లేదు
 నాకు ప్రత్తిపాటి పుల్లారావుతో శత్రువు లేదని, అగ్రిగోల్డు చైర్మన్‌ తమ్ముడే ఎవరో నాకు తెలియదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డు బాధితులు తన వద్దకు వచ్చి  సాక్ష్యాధారాలతో సహా ఇవ్వడంతోనే నేను అసెంబ్లీలో మాట్లాడాను అన్నారు. అగ్రిగోల్డుపై 2014 తరువాత కేసులు నమోదు అయితే ఆ తరువాత మంత్రి పుల్లారావు తన భార్య పేరుతో తక్కువ ధరకు అగ్రిగోల్డు భూములు కొనుగోలు చేసిన విషయాన్ని అసెంబ్లీలో గుర్తు చేశానన్నారు. ఈ విషయంలో విచారణ చేపట్టండి అని సీఎం దృష్టికి తీసుకెళ్తే..అధికార పక్షం మాత్రం ఆశ్చర్యంగా ఆగ్రిగోల్డు అంశాన్ని పక్కనపెట్టారని ఫైర్‌ అయ్యారు. బాధితుల సమస్యలు వినడానికి వారికి మనసుకు రాలేదని విమర్శించారు. టీడీపీ నేతలకు మైక్‌   ఇచ్చి నన్ను తిట్టించారు. ఆ తిట్లు ఆశీస్సుల క్రింద తీసుకుందాం అనుకుంటే అసలు ఆ అంశాన్ని పక్కదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంటరీ సదస్సు సందర్భంగా స్పీకర్‌ ప్రెస్‌మీట్లో ఆడవాళ్లపై అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు అన్ని మీడియా చానళ్లు చూపించాయని గుర్తు చేశారు. ఇవాళ వాళ్లు చేసిన పని ఏంటంటే..సాక్షి చూపించింది ముందుకు తెచ్చి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని తప్పుపట్టారు. ఆగ్రిగోల్డుకు, స్పీకర్‌ ప్రెస్‌మీట్‌కు సంబంధం ఏంటని సభలో ప్రశ్నిస్తే మైక్‌లు ఇవ్వడం లేదన్నారు. టీవీలకు సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ రోజు ఆడవాళ్ల గురించి సభలో చూపించారు. ఇలాంటి కౌరవ సభను చూడలేక బయటకు వచ్చి మీడియాకు చెప్పానని వివరించారు. అగ్రిగోల్డు బాధితుల సమస్య రాబోయే రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేస్తాం. తోడుగా ఉంటామని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. చంద్రబాబు చర్మం మందం కాబట్టి..ఫలితం వస్తుందన్న నమ్మకంతో పోరాటం చేస్తామన్నారు. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు చేస్తామని, ఈ ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షలకు మరో రూ.7 లక్షలు పూవ్వుల్లో పెట్టి ఇస్తామని వైయస్‌ జగన్‌ వాగ్ధానం చే శారు.
Back to Top