లౌకికవాదానికి కట్టుబడి ఉంటా: జగన్

హైదరాబాద్ 30సెప్టెంబర్2013:తాను లౌకిక వాదానికి కట్టుబడి ఉంటానని వైయస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన విస్పష్టంగా బదులిచ్చారు. లౌకికవాదం నుంచి తాను ఎన్నడూ పక్కకి వైదొలగలేదని తెలియజేశారు. నా తీరు చంద్రబాబు మాదిరిగా ఉండదన్నారు. ఆయన ఎన్ని యూ టర్నులైనా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీని ఒక సమర్థ పాలకుడిగా తాను అభినందిస్తానని చెప్పారు. ముస్లిములైనా, క్రిస్టియన్లైనా ఇక్కడే పుట్టామనీ, ఇక్కడే జీవించాలి.. మరణించాలి అని చెప్పారు. నేను పాతతరం మనిషిని మాత్రం కాదన్నారు. నాకు కావాల్సింది శాంతి, అభివృద్ధి అని శ్రీ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదని స్పష్టంచేశారు. దాన్ని ఎటువంటి పరిస్తితిలోనూ రాజకీయం చేయరాదని చెప్పారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలనూ లౌకిక వాద వేదిక మీదకి తీసుకువచ్చి రాజకీయ వ్యవస్థలో మార్పు తేవడానికి ప్రయత్నించాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సూచించారు. అలాకాకపోతే, వేరే మతస్థులలో అభద్రతాభావాన్ని సృష్టించిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా దేశంలో ంతర్గత ఉగ్రవాదం పెరుగుతుందన్నారు.

Back to Top