రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తా....

హైదరాబాద్  రాష్ట్రంలోని
ప్రజలందరి కళ్లలో సంతోషాన్ని నింపుతానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా సందేశమిచ్చారు. మహానేత
వైయస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే , ఆయన
కుమారుడు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా
సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటడం విశేషం. ఈ  సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జననేత జగన్
ట్వీట్ చేశారు.

‘‘2004,
మే14న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి
ఒక్కరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దివంగతనేత ప్రమాణం చేసిన రోజునే ప్రజాసంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లకు
చేరుకుంది. నాటి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తానని, రాష్ట్ర ప్రజలందరి కళ్లల్లో
సంతోషాలు నింపుతానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా’’ అని వైయస్‌ జగన్‌ ట్విటర్‌లో
పేర్కొన్నారు.

Back to Top