ప్ర‌తి కార్య‌క‌ర్త గ‌ర్వించేలా బ‌తుకుతా

కర్నూలుః పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటలకే దిక్కులేకపోతే ఇక మనం ఎవర్ని నమ్మాలి అని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని ఇలాంటి నాయకులుతో వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని విమ‌ర్శించారు. ఎంతకాలం బ‌తికాం అన్న‌ది ముఖ్యం కాదు. ఎలా బ‌తికామ‌న్న‌ది ముఖ్యం  అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ తాను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ను అనేలా తాను బ‌తుకుతాన‌న్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ విడుద‌ల చేసిన ప్రెస్ మీట్ చ‌దివితే ఇంగ్లీష్ వ‌చ్చిన వాడు ఎవ‌డైనా రాజీనామా చేయాల్సిందేనని, అస‌లు చంద్ర‌బాబుకు ఇంగ్లీష్ వ‌చ్చా? రాదా? అన్న అనుమానం క‌లుగుతోందన్నారు. హోదా కోసం మీరంద‌రూ కూడా క‌లిసి రావాల‌ని కోరారు.

Back to Top