వైయస్ఆర్‌సీపీని విడిచిపెట్టను: గురునాథరెడ్డి

అనంతపురం :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తాను విడిచిపెడుతున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం బూటకమని పార్టీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు.  పార్టీని తాను విడిచిపెట్టేది లేదన్నారు. మీడియా అత్యుత్సాహం వల్లే ఈ దుష్ర్పచారం జరిగిందని ఆయన చెప్పారు. అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంతరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి కుటుంబంతో 40 ఏళ్లుగా తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని గురునాథరెడ్డి తెలిపారు. కష్టనష్టాల్లో పరస్పరం పాలుపంచుకుంటామనే విష యం అందరికీ తెలిసిందేన అన్నారు. గురునాథరెడ్డి రాజీనామా అంటూ కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌సీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. గురునాథరెడ్డి రాజీనామా వదంతులు కేవలం మీడియా సృష్టే పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top