చివ‌రి శ్వాస వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోనే ఉంటా

* గిట్ట‌ని వాళ్లే పుకార్లు పుట్టిస్తున్నారు
* సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం
* పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
వాల్మీకిపురం (చిత్తూరు):  ``నా చివ‌రి శ్వాస వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా`` అని  ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి అన్నారు.  స్థానికంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీపీ అరుణమ్మ, జెడ్పీటీసీ శ్రీవల్లితో కలసి మాట్లాడుతూ గత రెండు రోజులుగా సోషియల్‌ మీడియాల్లో 11 మంది వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రసారాలు హల్‌చల్‌ చేస్తున్నాయన్నారు. ఫ్యాన్‌ గుర్తుతో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రాచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిల ఆశీర్వాదంతో గెలిచినన్నారు. 2019 ఎన్నికలల్లో ఫ్యాన్‌ గుర్తుతో పోటీ చేసి గెలుపొందుతానని తెలిపారు. నియోజకవర్గంలో 1987 నుంచి తాను ఆరు పర్యాయాలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశానని, అలాగే మా కుటుంబం తొమ్మిది పర్యాయాలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. తమకు అధికారం వున్నా, లే కున్నా తమను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారని, వారి రుణం ఎన్నంటికి మరవబోమన్నారు. నిరంతరం నియోజకవర్గ ప్రజల కష్ట, సుఖాలల్లో పాలుపంచుకుంటానని ఆయన తెలిపారు. నిరంతరం వారి సేవకే నేను అంకితం అయినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు, తమ అనుచరులు ఎవ్వరూ ఇలాంటి సోషియల్‌ మీడియాలైన వాట్సప్, ట్విటర్, యూట్యూబ్‌ వంటి ప్రసారాలలో ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మి మోసపోవద్దని, జగన్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా ఏ పార్టీ వైపు వెళ్ళడం లేదని ఆయన కుండలు బద్దలు కొట్టినట్లు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 2వ తేదిన దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్ధంతిని నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలల్లో  నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.  కార్యక్రమానికి ఆయా మండలాల నాయకులు, కార్యర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ అరుణమ్మ, జెడ్పీటీసీ శ్రీవల్లి, మండల పార్టీ అధ్యక్షులు నీళ్ళ భాస్కర్, సర్పంచ్‌లు చంద్రశేఖర్, కుమార్, నాయకులు కేశవరెడ్డి, జ్యోతిరెడ్డి, రవి, వెంకటేష్, సుధ తదితరులు  పాల్గొన్నారు. 
Back to Top