వైఎస్ జగన్ తోనే ఉంటా

విజయనగరం : పార్టీని వీడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. విజయనగరంలో రాజన్న దొర మాట్లాడుతూ... రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను సంపాదించింది ఏమీ లేదన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నష్టపోయింది ఏమీ లేదని ఆయన చెప్పారు. 

జిల్లాలోని బొబ్బిలి రాజులు పార్టీ మారడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న తమపై కూడా అనుమానాలు ఉండటం సహజమే అని  రాజన్న దొర అన్నారు.  ప్రజల కోసం తప్ప ప్రలోభాలకు తలొగ్గే మనిషిని కాదని రాజన్న దొర తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని రాజన్నదొర వెల్లడించారు.
Back to Top