జీవితాంతం వైఎస్ జగన్ తోనే

గుంటూరు: 'తనకు రాజకీయ భిక్ష పెట్టిందే  తమ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని  నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జీవితాంతం తాను వైఎస్ జగన్తో ఉంటానని చెప్పారు.

బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని గోపిరెడ్డి ఫైరయ్యారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పోలవరానికి రూ.100 కోట్లు కేటాయిస్తే నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Back to Top