నాకు సంబంధం లేదు-మైసూరా

ఆంగ్ల దినపత్రిక 'మెట్రో ఇండియా డైలీ టుడే'లో వచ్చిన 'now, stir for seema statehood' అనే కథనానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని
వైఎస్ఆర్‑సీపీ సీనియర్ నాయకులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు,  మాజీ మంత్రి ఎంవీ మైసురారెడ్డి స్పష్టంచేశారు. ఈ
మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనను సంప్రదించి ఆ పత్రికలో వార్త
ప్రచురితమైనట్లుగా వచ్చిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు మెట్రో ఇండియా ఇంగ్లీషు దిన పత్రికలో ప్రచురితమైన నా  ఇంటర్వ్యూ
ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురి
అయ్యాను రాయలసీమ ప్రత్యేక
ప్రతిపత్తి .. ఉద్యమం అనే వార్తా శీర్షిక కింద నేను ఆ దినపత్రిక విలేఖరి కి
పీ ఆర్
కే ప్రసాద్ తో మాట్లాడినట్లుగా ప్రచురించారు. నన్ను ఆ పీ ఆర్ కే ప్రసాద్
కానీ, మరో స్టాఫ్ రిపోర్టర్ కానీ ఏ విధమైన ఇంటర్వ్యూ చేయలేదు.   ఈ ఇంటర్వ్యూని ఊహా జనితంగా ప్రచురించి దానిని నాకు ఆపాదించటం ఏమాత్రం
సమంజసంగా లేదు. 

కావున మెట్రో ఇండియా లో ప్రచురితమైన సీమ ప్రత్యేక ప్రతిపత్తి..ఉద్యమం అనే
అంశంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. 

Back to Top