రేపటి నుంచి అసెంబ్లీకి వెళుతున్నాః రోజా

హైదరాబాద్ః కోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందించినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు తనను అన్యాయంగా సస్పెండ్ చేయడం వల్ల...నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లలేకపోయానని రోజా వాపోయారు. ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేసేవిధంగా సస్పెండ్ చేశారని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రేపటి నుంచి తాను అసెంబ్లీకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఐతే, తనకు ఎలాంటి క్వశ్చన్ లు ఇవ్వలేదు కాబట్టి...జీరో అవర్ లో అయినా మాట్లాడే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. 

గతంలో వైఎస్ జగన్ కు బెయిల్ వచ్చినప్పుడు చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపర్చేలా మాట్లాడారని...ఇప్పుడు కూడా అలాంటి చర్యలకు దిగితే మరోసారి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. న్యాయ‌వ‌వ్య‌స్థ‌ను గౌర‌వించ‌కుండా హైకోర్టును వ‌క్రీక‌రించి మాట్లాడితే వారిపై న్యాయస్థానం  చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం రెట్టింపు అయ్యిందని, ఓ తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దేందుకు న్యాయవ్యవస్థ ఉంటుందని రోజా స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top