ఎమ్మెల్యే నిరాహార దీక్ష

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అభివృద్ధి నిధుల కేటాయింపులో నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయంపై సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌  గాంధీబొమ్మ వద్ద చేపట్టిన నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగింది.  నియోజకవర్గంలో అసలైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ వివక్షత చూపుతున్న అధికారపార్టీపై వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ధ్వజమెత్తారు. అనిల్ దీక్షకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మద్దతు పలికారు. నగర నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై నిప్పులు చెరిగారు. 

Back to Top