వంద కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ జిల్లా పెద్ద ముడియం మండ‌లం భుత‌మాపురం గ్రామానికి చెందిన వంద కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ..శ‌న‌గ పంట‌కు సంబంధించిన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం మోసం చేస్తుంద‌న్నారు. ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంద‌రికి అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న హ‌మీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో క‌డ‌ప పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు సురేష్ బాబు, డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top