అనాథ మహిళకు ఆపన్న హస్తం
ధర్మవరం నియోజకవర్గంలో  రోజు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్డు పక్కన అచేతనంగా, అపస్మారక స్థితిలో ఉన్న ఒక అనాథ వృద్ధ మహిళను గమనించారు. వెంటనే వడివడిగా ఆమె వద్దకు వెళ్లారు. ఆయన ఎందుకలా వెళుతున్నారో అర్థం కాక పాదయాత్రలో ఉన్న వారు, భద్రతా సిబ్బంది ఒకింత కంగారు పడ్డారు. 
ఆ మహిళ వద్దకు వెళ్లిన వైయస్ జగన్  ఆమె దుస్థితి పట్ల విచారాన్ని, బాధను వ్యక్తంచేస్తూ,  చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించాలంటూ పార్టీ నాయకులను ఆదేశించారు.  ఆమె ఆరోగ్యం మెరుగైన తరువాత ,  అనాథ శరణాలయానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ధర్మవరం నియోజకవర్గం సమన్వయ కర్త కేతిరెడ్డి వెంకటరామి రెడ్డిని వైయస్ జగన్  సూచించారు.
Back to Top