బాబుది మానవత్వం లేని పరిపాలన

బాబుది మానవత్వం లేని పరిపాలన
ఏ పాపం చేశారని పెన్షన్లు కట్‌ చేస్తున్నారు?
టీడీపీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది?
మన ప్రభుత్వం రాగానే అర్హులందరికీ పెన్షన్లు
అడిగిన 72 గంటల్లోనే రేషన్, ఇల్లు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్‌
బత్తులపల్లి పెన్షన్‌ బాధితులతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


   
అనంతపురం: రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌లు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బత్తులపల్లి మండలంలో పెన్షన్‌ అందని లబ్ధిదారులను కలిశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వైయస్‌ జగన్‌కు తమ సమస్యను చెప్పుకున్నారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా.. పెన్షన్‌ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏ పాపం చేశారని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ కట్‌ చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అర్హులైన వారికి పెన్షన్‌లు ఊడబెరుకుతున్నారంటే ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం అవుతుందన్నారు. పెన్షన్‌లు అందే విధంగా కలెక్టర్‌కు లేఖ రాస్తానని జననేత వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారిది కాబట్టి వస్తుందో.. రాదో.. చెప్పలేమని, ఇంకో సంవత్సరంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అందరికీ పెన్షన్‌లు ఇస్తామని, రాజకీయాలు చేయం. పార్టీలు, కులమతాలు చూడం, గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి స్థానికులకు పది మందికి అందులో ఉద్యోగాలు ఇస్తామన్నారు. అడిగిన 72 గంటల్లోనే పెన్షన్లు, ఇల్లు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్, వచ్చేట్లుగా చేస్తానని ధైర్యం చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ.3 వేల పెన్షన్‌ ప్రతీనెల అందిస్తానన్నారు. ఎవరూ అధైర్యపడకుండా.. ఒక్క సంవత్సరం ఓపిక పట్టాలని కోరారు.
Back to Top