లంక భూముల్లో రాబందులు..!


() కొట్టేసిన లంక భూములు  1,250 ఎకరాలు
() లబ్ధి చేకూరింది... 2,500 కోట్ల రూపాయలుట
() కాజేసిన అసైన్డ్ భూములు 1,848 ఎకరాలు
() లాభం  3,234 కోట్ల రూపాయలు

కానలలో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి.. జీవం ఉన్నవాటి జోలికి రావు. రాజధానిలో వాలిన ‘భూ’ రాబందులు బతికి ఉండగానే బడుగురైతులను పీక్కుతింటున్నాయి.. పాపం-పుణ్యం ఆలోచించవు..  బినామీ పేర్లతో రైతుల భూములను బిట్లు బిట్లుగా కాజేసిన  భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూములను కాజేయడానికి అంతర్జాతీయ స్థాయి స్కెచ్ వేశారు.. రాజధానిని ప్రకటించి... సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై ‘పెద్దలంతా’ కన్నేశారు.  పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామదానభేద దండోపాయాలెన్నో ప్రయోగించారు. రైతులను భయపెట్టి.. వారంతట వారే అయినకాడికి పొలాలు అమ్ముకునేలా చేశారు. అంతా అయ్యాకపరిహారాలు, ప్యాకేజీలు ప్రకటించుకున్నారు. ఐదూపది లక్షలిచ్చి సొంతం చేసుకున్న భూములు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి. దళిత రైతులపై కూడా ఇలాంటి మాయోపాయాలే ప్రయోగించి అసైన్డ్ భూములనూ మింగేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లను ‘చట్టబద్ధం’ చేసేశారు.

 
►రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములు తొలుత భూ సమీకరణలో లేవు.
►‘భూ’ బకాసురుల కుట్రలు ఫలించే వరకు వాటిని పక్కనుంచారు..
►పరిహారం ఇవ్వకుండా లాక్కుంటారని అనుచరులతో ప్రచారాలు చేయించారు
►దాంతో నిజమేననుకుని రైతులు భయపడ్డారు.
►భూములను వచ్చిన రేటుకు అమ్మేసుకున్నారు.
►పెద్దలంతా బినామీ పేర్లతో 1249.54 ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు.
►ఆ తర్వాత లంక భూముల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
►ఎకరా ధర రూ. 1.75 కోట్లు పలికింది.. ‘పెద్దలు’ రూ. 2,500 కోట్లకు పైగా లాభపడ్డారు.
►అసైన్డ్ భూములూ అంతే.. బినామీ పేర్లతో 1,848 ఎకరాలు కైంకర్యం చేశారు.
►ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగాయి.
►ఎకరా రూ. 1.5కోట్లు నుంచి రూ. 1.75 కోట్లు పలుకుతున్నాయి. ‘పెద్దల’కు రూ. 3,234 కోట్లమేర లబ్ధి చేకూరింది.
Back to Top