జననేతకు జన నీరాజనం

వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఈతరం నాయకుడు వైఎస్ జగన్ కు జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవానికి వైఎస్ జగన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ప్రజలు, అభిమానులు జననేతను చూసేందుకు ఆలయానికి పోటెత్తారు. 

తమ అభిమాన నాయకుడిని దగ్గరి నుంచి చూడాలని, కరచాలనం చేయాలని ప్రజానీకం పోటీపడ్డారు. వైఎస్  జగన్ కడప నుంచి ఒంటిమిట్టకు వెళ్తున్నప్పుడు, తిరిగి ఒంటిమిట్ట నుంచి కడపకు బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ప్రతి గ్రామం వద్ద జనం పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి తరలివచ్చారు. వైఎస్ జగన్ తన చిరునవ్వులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ... అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ముకుందాశ్రమం వద్ద అభిమానులు వైఎస్ జగన్ ను కలుసుకొన్నారు. జై జగన్ అంటూ నినదించారు. కాసేపు వైఎస్ జగన్ వారితో ముచ్చటించారు. రథోత్సవ వేడుక ముగిసిన అనంతరం వైఎస్ జగన్ ఒంటిమిట్ట నుంచి కర్నాటకకు బయలుదేరారు. 
Back to Top