జ‌న‌నీరాజం

వేంప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగున హ‌ర‌తులు ప‌డుతున్నారు. సోమవారం ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన జననేత మొదటిరోజు 8.9 కిలోమీటర్లు నడిచారు. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేసిన ఆయన రాత్రి 6.40 గంటలకు బసకు చేరుకున్నారు. యాత్ర ప్రారంభం నుంచి రాత్రి ముగిసే దాకా చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఎక్క‌డ చూసిన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ జ‌న‌నేత‌కు త‌మ గ్రామాల‌కు ఆహ్వానిస్తున్నారు.  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా రెండో రోజు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉద‌యం 9 గంట‌ల‌కు వైయ‌స్ఆర్ జిల్లా వేంపల్లి శివారు నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను చూసేందుకు అశేషంగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌తి ఒక్క‌రిని ఆయ‌న ప‌ల‌క‌రిస్తూ యాత్ర‌ను మొద‌లుపెట్టారు. వేంప‌ల్లి వ‌ద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అక్క‌డి నుంచి వైయ‌స్ కాల‌నీలో జ‌న‌నేత ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌తో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

యాత్ర సాగేదిలా..

వేంపల్లి క్రాస్‌ రోడ్డు, వైయ‌స్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజపేట మీదుగా గాలేరు-నగరి కెనాల్‌ వరకు యాత్ర సాగనుంది. ఈరోజు 12.6 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. నీలతిమ్మాయిపల్లి సమీపంలోని ఈరోజు యాత్రను ముగించనున్నారు 
-ఉదయం 8.30 గంటలకు వేంపల్లి శివారులోని బస నుంచి వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు.
-9.05 గంటలకు రవి పెట్రోల్‌ బంకు వద్ద ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతారు. 9.50 గంటలకు వేంపల్లె నాలుగు రోడ్లకూడలిలో వైయ‌స్ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.  
-11.10 గంటలకు శ్రీనివాసకల్యాణ మండపంలో ప్రజలతో ముఖాముఖి.
-11.35 గంటలకు బైపాస్‌ రోడ్డులోని ఆలయంలో పూజలు
-12 గంటలకు వైఎస్సార్‌ కాలనీలో వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేస్తారు.
-12.20 గంటలకు కడప– పులివెందుల మార్గంలో మధ్యాహ్న భోజన విరామం.
-మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం
-3.45 గంటలకు సర్వరాజపేట గ్రామానికి చేరుకుంటారు.  
-సాయంత్రం 5.20 గంటలకు గాలేరు–నగరి కాలువ పరిశీలన.  
-రాత్రి 8.30 గంటలకు ప్రొద్దుటూరు రోడ్డులోని నేల తిమ్మాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు.
Back to Top