మేలుకొలుపు పాదయాత్రకు విశేష స్పందన

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం 8వ రోజు పాదయాత్ర గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు, పాత కల్లూరు, కల్లూరు, ఎగువపల్లె, కనంపల్లె క్రాస్, గుడ్డాలపల్లె, శిరివరం, బూదేడు గ్రామాల్లో సాగింది. ప్రతి ఊర్లో పద్మావతికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు, తాడిపత్రి సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top