వైయ‌స్ఆర్ కుటుంబానికి విశేష ఆద‌ర‌ణ‌

వీరబల్లి: మండలంలో నిర్వహిస్తున్న వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ట్లు వైయ‌స్ ఆర్‌సీపీ  మండల కన్వీనర్‌ గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దివీడు పెద్దహరిజనవాడ, సోమవరం గ్రామాల్లో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా టీడీపీ అవినీతి గురించి ప్రజలకు తెలిపారు. పలుగ్రామాల్లో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు మండల కన్వీనర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్‌ శ్రీరామ, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డి, సభ్యులు వీరాంజనేయరెడ్డి, శంకరయ్య, చంద్రమోహన్‌రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 

విద్యానగర్‌లో..
బద్వేలు: పట్టణంలోని 14 వ వార్డు పరిధిలోని విద్యానగర్‌లో సోమవారం ఆరోవార్డు కౌన్సిలరు గోపాలస్వామి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వైఫల్యాలను వివరిస్తూ పలువురిని వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేర్పించారు. మిస్‌డ్ కాల్ ఇచ్చిన వారికి వైయ‌స్‌ జగన్‌ కార్యాలయం నుంచి ఫొన్‌ చేసి సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని స్థానిక పార్టీ నాయకుల ద్వారా పరిష్కరించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పార్టీ నాయ‌కులు తెలిపారు. 
Back to Top