విజయవాడలో పార్టీనేతల భారీర్యాలీ

విజయవాడ) రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని విజయవాడలో వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద
ఎత్తున నిర్వహించారు. పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమాలకు హాజరు అయ్యారు. మొదటగా
స్థానిక గాంధీనగర్ నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో
ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, పార్టీ
నేతలు కొల్లు పార్థసారధి, మేరుగ
నాగార్జున, సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్‌తో
పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
పాల్గొన్నారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 

 

Back to Top