ప్రోటోకాల్ ఉల్లంఘనకు నిరసనగా భారీ ర్యాలీ

వైయస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కడపలో భారీ ర్యాలీ నిర్వహించింది. అసలు ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నందుకే తమపై  అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, జిల్లా అధికారులు ప్రొటోకాల్ను పాటించలేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Back to Top