దారుల‌న్నీ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైపే



- ప్ర‌జాద‌ర‌ణ చూసి ఓర్వ‌లేక‌పో
- అధికార పార్టీ నేత‌ల బెదిరింపుల‌ను లెక్క‌చేయ‌ని అనంతవాసులు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పంద‌న వ‌స్తోంది. జ‌న‌నేత వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న జ‌నం ప‌నులు మానుకొని ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. వేరు వేరు గ్రామాల నుంచి కూడా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి రాజ‌న్న బిడ్డ‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొని స్వాంత‌న పొందుతున్నారు.  గ‌త నెల 6వ తేదీన వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే పాద‌యాత్ర‌ 500 కిలోమీటర్లు దాటింది. ‘రాజన్న బిడ్డ వ‌స్తున్నాడ‌ని.. ఒక్కసారి చూ ద్దాం’అంటూ అవ్వ తాతలు.. ‘అన్నొస్తున్నాడు.. ఎలాగైనా సరే షేక్‌ హ్యాండ్‌ తీసుకోవాల్సిందే’ అంటూ యువకులు.. ‘అన్నకు హారతి పట్టా లి..’అంటూ అక్క చెల్లెళ్లు పోటీ పడటంతో యాత్ర సాగిన రహదారి జనంతో కిక్కిరిసిపోతుంది.  చిన్నా పెద్దా... ముసలి ముతకా తేడా లేకుండా భారీగా జనం తరలివచ్చా రు. ఉదయం నుంచి రాత్రి వరకూ వైయ‌స్ జగన్‌తో పాటు అడుగు కలుపుతున్నారు. 

జ‌న‌సంద్రం
వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్రగా వ‌స్తున్న దారుల‌న్ని కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటర్ల పొడవునా జ‌న‌నేత‌ కోసం జనం బారులు తీరుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు, చేయి కలిపేందుకు, కలిసి నడిచేందుకు పోటీపడ్డారు. పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, రైతులు, కూలీలు, మహిళలు, యువకులు అభిమాన నేతకు సంఘీభావంగా నిలుస్తున్నారు. మైనారిటీ, దళిత, బీసీ సంఘాలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి.
అడుగడుగునా కన్నీళ్ల వెతలే. అభాగ్యుల గుండెకోతలే. అందరి సమస్యలనూ వైయ‌స్ జగన్‌ సావధానంగా వింటున్నారు. కొన్నింటికి పరిష్కారం చూపుతున్నారు. మరికొన్ని మన ప్రభుత్వం వస్తే పరిష్కారమవుతాయనికొండంత ధైర్యాన్నిస్తున్నారు.

ఆప‌లేక‌పోతున్నారు
ప్రజా సంకల్ప యాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో దిక్కుతోచని సర్కారు పెద్దలు నిఘా వర్గాలను రంగంలోకి దింపారు. జనం ఎందుకిలా వస్తున్నారంటూ ఆరా తీశారు. తమ పట్ల ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్న నివేదికలు అందుకుని ఆందోళనలో పడ్డారు. పాదయాత్రకు వెళ్లొద్దని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ జనం లెక్కచేయక తండోప తండాలుగా తరలిరావడం గమనార్హం. ధర్మవరం నియోజకవర్గంలో జనమంతా జననేత యాత్ర గురించే వారం రోజులుగా చర్చించుకుంటున్నారు. ఆయనతో కలిసి నడవాలని ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కేడర్‌ చేజారిపోకుండా తెలుగుదేశం పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. గొట్లూరు ఎంపీటీసీ సభ్యుడు వైయ‌స్ఆర్‌సీపీలోకి వెళ్తున్నట్టు సంకేతాలు అందడంతో రాత్రికి రాత్రే అతన్ని అజ్ఞాతంలోకి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేడర్‌ను కనుసన్నల్లో పెట్టుకున్నా ప్రజలను మాత్రం పాదయాత్ర బాట పట్టకుండా ఆపలేకపోయారని బత్తలపల్లికి చెందిన రమేష్‌ అన్నారు. ఇక టీడీపీకి రోజులు ప‌డిన‌ట్లే అని ప్ర‌జలు చ‌ర్చించుకుంటున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే మంచి రో్జులు వ‌స్తాయ‌ని విశ్వ‌సిస్తారు.
Back to Top