వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు

  • కన్నబాబు సమక్షంలో పార్టీలో చేరిక
  • దమ్మూ, ధైర్యం ఉన్న నాయకుడు 
  • ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు వైయస్ జగన్ 
  • చంద్రబాబుది దొడ్డిదారి జీవితం
  • టీడీపీ అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి
  • 2019లో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం
  • తూ.గో. జిల్లా నాయకుల పిలుపు
తూర్పుగోదావరిః జిల్లాలో వివిధ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన నాయకులు భారీగా వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నబాబు, ముత్యాల శ్రీనివాస్, జక్కంపూడి రాజా తదితరులు వీరందరికీ కుండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

రాష్ట్రంలో దమ్మూ, ధైర్యం ఉన్న పార్టీ...దమ్మూ, ధైర్యం ఉన్న నాయకుడు వైయస్ జగన్ అని కన్నబాబు అన్నారు. బాబు జీవితంమొత్తం ఎత్తులు వేసుకోవడం, దొడ్డిదారులు వెతుక్కోవడం, అనుకున్నది సాధించుకునేందుకు ఎవరినైనా మేనేజ్ చేసుకోవడం తప్ప మరో ఆలోచన లేదన్నారు. పిల్లనిచ్చి రాజకీయ జీవితం ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదేనన్నారు. వాడేయడం, ఆతర్వాత డస్ట్ బిన్ లో పడేయడం బాబు నైజమన్నారు. వైయస్ జగన్ అలా కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అనుకున్నది నెరవేర్చడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ లో సోనియాగాంధీ మొదలు చంద్రబాబు వరకు నిరంతరం పోరాడుతున్న వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. ప్రజలను మోసగించాలనుకుంటే ఈపాటికే ఎప్పుడో ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేవారన్నారు. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయనని తమకు ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారని గుర్తు చేశారు. 

వైయస్సార్సీపీకి రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోందని జక్కంపూడి రాజా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ లాంటి మంచి పరిపాలన రావాలంటే అది వైయస్ జగన్ తోనే సాధ్యమని  నమ్మి ప్రజలు వైయస్సార్సీపీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకొని వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని  నేతలు పిలుపునిచ్చారు. 

మనం ఆదరిస్తే, ప్రజలు మనను ఆదరిస్తారని ముత్యాల శ్రీనివాస్ అన్నారు. గడపగడపకు వైయస్ఆర్ అనే కార్యక్రమం పేరుతో వైయస్ జగన్ పార్టీ నాయకులను ప్రజల్లోకి పంపించడం మంచి నిర్ణయమని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లు పడే బాధలన్నీ తమ దృష్టికి వస్తున్నాయన్నారు.  ఎన్నికలప్పుడు తప్పించి ఎప్పుడూ నాయకుడనేవాడు ప్రజల ఇంటికి వెళ్లిన దాఖలాలు లేవేమోనని అన్నారు. ప్రతి పేదవాడి సమస్య తెలుసుకోవాలన్న ధ్యేయంతో వైయస్ జగన్ గడపగడపకు కార్యక్రమం పెట్టారని చెప్పారు. టీడీపీ అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం వస్తుందని, కార్యకర్తలంతా విజయం కోసం శ్రమించాలని పేర్కొన్నారు.Back to Top