దావానంలా వైయస్సార్సీపీలోకి చేరికలు

  • వైయస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి, అనుచరులు
  • శ్రీనన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా
  • వైయస్ఆర్ కుటుంబసభ్యునిగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం
  • బాబు పాలన ఎంత అన్యాయంగా ఉందో చెప్పడానికి చేరికలే నిదర్శనం
  • టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో చేరికల సందర్భంగా వైయస్ జగన్ వ్యాఖ్యలు
హైదరాబాద్ః మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అతని అనుచరులు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో వీరంతా  పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో వైయస్ జగన్ వీరిందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ...శ్రీనన్నను పార్టీలో చేర్చుకోవడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. కాపిటల్ సిటీగా ఉన్న విజయవాడ నగరంలో పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రీను, అతని సహచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు. 

బాబు పరిపాలన ఎంత అన్యాయంగా, దారుణంగా ఉందో చెప్పడానికి  ఈ చేరికలే అందుకు నిదర్శనమని వైయస్ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో బాబు పాలనను బంగాళాఖాతం కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ చేరికలు శ్రీనుతో మొదలైందని, మున్ముందు ఇంకా దావనంలా వ్యాపిస్తుందని తెలిపారు.  వైయస్ఆర్ కుటుంబసభ్యునిగా శ్రీనును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. 

ఎన్నికలప్పుడు ఏం మాటలు మాట్లాడావ్. ఎన్నికలయ్యాక నీవు చేస్తున్నదేంటి..? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం ధర్మమేనా అంటూ బాబును నిలదీస్తున్న పరిస్థితుల్లో ....టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ మనస్ఫూర్తిగా పార్టీలో చేర్చుకుంటున్నామని వైయస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ తో పార్టీ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొలుసు పార్థసారథి, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. కాగా, గతంలో విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
Back to Top