వైయ‌స్సార్‌సీపీలోకి భారీ చేరిక‌లు

నంద్యాల‌(నూనెప‌ల్లి):  చంద్ర‌బాబు అస‌మ‌ర్థ‌త పాల‌నపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. వైయ‌స్సార్‌సీపీ ఎల్ల‌ప్పుడు ప్ర‌జ‌ల ప‌క్ష‌న పోరాటాలు చేస్తుంది కాబ‌ట్టే టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్సార్‌సీపీలో చేరుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవ‌న‌గ‌ర్ వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు శివ‌, సుబ్ర‌మ‌ణ్యంల ఆధ్వ‌ర్యంలో టీడీపీకి చెందిన సుమారు 100 మంది కార్య‌క‌ర్త‌లు వైయ‌స్సార్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్నాఇంత‌వర‌కు ఒక్క‌రికి కూడా పూర్తిస్థాయి రుణ‌మాఫీ కాలేద‌న్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని బాబు... ఇప్పుడు బాబు ఉంటే జాబు పోతుంద‌న్న భ‌యం ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న పార్టీలో చేరిక కార్య‌క‌ర్త‌ల‌కు వైయ‌స్సార్సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top