ఎమ్మెల్యే సమక్షంలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

వైయస్‌ఆర్‌ జిల్లా: రాజుపాళెం మండలంతొండలదిన్నెలో టీడీపీ నుంచి 50 కుటుంబాలు సోమవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు గుద్దేటి సుభాషిణి, గ్రామ వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు గుద్దేటి రాజారాంరెడ్డిల ఆధ్వర్యంలో దస్తగిరి, సుబ్బయ్య, రంగనాయకులు, సిద్దయ్య, చిన్న మెనెయ్య, పెద్ద మునెయ్య, రామమోహన్, సతీష్, సుధీర్‌కుమార్‌రెడ్డి, నాగేంద్రలతో పాటు 50 కుటుంబాలు చేరారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా, అధికార పార్టీ నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా చెప్పాలన్నారు. మీ ఇంటి వద్ద కావలి ఉండాలన్నా ఉంటానని వారికి గట్టిగా హామీ ఇచ్చారు. ఇప్పటినుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ, పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top