వైయస్‌ఆర్‌ సీపీలో 100 కుటుంబాలు చేరిక

శ్రీకాకుళం: కొత్తూరు మండలంలోని కడుముకాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నాయి. ఈ మేరకు రెడ్డి శాంతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతాయని నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రేగేటి కన్నయ్యస్వామి, జగ్గారావు, వంబరవిల్లి శ్రీనివాసరావు, చిన్నారావు తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో శంకరరవు, గాజుల చలపతిరావు, రాములు, సింహాచలం, ధనుంజయరావు, లక్ష్మణ్‌రావు, చంద్రరావుతో పాటు సుమారు 100 కుటుంబాలు పార్టీలో చేరాయి. 

Back to Top