కర్నూలులో భారీ చేరికలు

కర్నూలుః వైయస్సార్సీపీకి రోజురోజుకు ప్రజాధరణ  వెల్లువెత్తుతోంది. ప్రజానాయకుడు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. జిల్లాలోని బుధవారపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఎంపీ బుట్టా రేణుక తన నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బుట్టా రేణుక పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top