వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

  • వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన వివిధ పార్టీల నేతలు
  • we for Jagan వెబ్ సైట్ ను ఆవిష్కరించిన వైయస్ జగన్

హైదరాబాద్ః వైయస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. టీడీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నాయకత్వానికి వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారు. వైయస్సార్సీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెల్లంపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేష్ రెడ్డి వైయస్సార్సీపీలో చేరడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. నేడు వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు తరలివచ్చి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్సార్సీపీ శ్రేణులు, వైయస్ఆర్, వైయస్ జగన్ అభిమానుల కోసం ఏర్పాటైన నూతన వెబ్ సైట్ we for jagan  లోటస్ పాండ్ లో వైయస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ వాసుదేవరెడ్డి వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వెబ్ సైట్ ద్వారా జాబ్ డెవలప్ మెంట్ స్కిల్స్ తో పాటు హెల్త్ క్యాంప్స్ తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top